Vibhuti and Benefits: విభూతి రాసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు.. అవి ఏమిటంటే?
భారతదేశంలో హిందువులు నుదుటిపై బూడిదను రాసుకుంటూ ఉంటారు. ఈ బూడిదనే విభూతి లేదా భస్మ అని కూడా
- By Nakshatra Published Date - 08:15 AM, Mon - 12 September 22

భారతదేశంలో హిందువులు నుదుటిపై బూడిదను రాసుకుంటూ ఉంటారు. ఈ బూడిదనే విభూతి లేదా భస్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ విభూతిని కొందరు నుదుటిపై రాసుకుంటే మరికొందరు చేతులు మరికొందరు చాతిపై కూడా రాసుకుంటూ ఉంటారు. అయితే యజ్ఞయగాలు చేసినప్పుడు అందులో కలప, నెయ్యి, అలాగే కొన్ని రకాల దినుసులు అన్నింటి కలయిక వల్ల వచ్చినదే ఈ విభూతి. అయితే దీనిని రాసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎందుకు బాగా తిరిగి తలనొప్పిగా అనిపిస్తున్నప్పుడు నుదుటిపై రాసుకోవడం వల్ల తలనొప్పి తగ్గి ఉపశమనం లభిస్తుంది. అలాగే విభూతిని నుదుటిపై రాసుకోవడం వల్ల జలుబు తగ్గుతుంది. అందుకే విభూతిని ఆయుర్వేద మందులలో ముఖ్య పదార్థంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. విభూతిని నుదుటిపై రాసినప్పుడు అది ప్రేరేపించబడటమే కాకుండా ముక్కుదిబ్బడ లాంటి సమస్యలను ఆపుతుంది. అలాగే విభూతిని నుదుటిపై రాసినప్పుడు అది మర్దనగా ఉపయోగపడే చర్మ ముడతలు పడకుండా చేస్తుంది.
కాగా విభూతిని పెట్టుకోవడం వల్ల నిరాశ జనక ఆలోచనలు రానికుండా విభూతి ఒక అడ్డులాగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా కనుబొమ్మల మధ్య స్థలాన్ని వేలుతో నెమ్మదిగా వచ్చినప్పుడు మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి తగ్గి నిద్ర లేని సమస్య నుంచి బయటపడి హాయిగా పడుకునే విధంగా చేస్తుంది.
Related News

Thangedu Flowers : తంగేడు పూలు, ఆకులు, బెరడు, వేర్లలో ఔషధ గుణాలివీ
Thangedu Flowers : ‘తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయప్పునే..’ అంటూ బతుకమ్మ పాట పాడతారు.