Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!
- Author : Vamsi Chowdary Korata
Date : 09-06-2026 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
పంచాంగం ప్రకారం, శనివారం చాలా పవిత్రమైన రోజు. ఈ రోజును విష్ణుమూర్తికి అంకితం చేశారు. ఈ రోజున విష్ణు అవతారాలైన రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేయాలి. విష్ణువును పూజించడానికి శనివారం కూడా ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూజలు, పరిహారాలు చేయడం వల్ల యువతీ యువకులు వివాహ సమస్యల నుండి అధిగమించవచ్చు.
చాలా సార్లు, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, వివాహంలో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్నిసార్లు వివాహం ఆలస్యం కావడం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడికి కారణమవుతుంది. వివాహంలో జాప్యం లేదా అడ్డంకులు ఏర్పడినట్లయితే, శనివారం విష్ణువును పూజించాలి; ఈ రోజు ఉపవాసం ఉండటం కూడా మంచిది. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి, పసుపు రంగు పళ్లు, పూలను దేవునికి నైవేద్యంగా పెట్టాలి. పసుపు రంగులో ఉండే పదార్థాలను ఉపవాసం అనంతరం తినాలి. శనగపిండి లడ్డూలు, శనగపిండి రోటీలు తినడం ఉత్తమం. దీనితో పాటు, జ్యేష్ఠ మాసం కావున జలదానం చేయడం చాలా శ్రేయస్కరం.
సుందరకాండ పఠించండి.
ప్రతి శనివారం సుందరకాండ చదవడం లేదా పారాయణం వినడం వల్ల వివాహ జాప్యం తొలగిపోతుంది. రామాయణంలోని సుందరకాండను క్రమం తప్పకుండా పారాయణం చేయడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. 21 శనివారాల పాటు నిరంతరం సుందరకాండ పఠించడం వల్ల అడ్డంకులు మరియు ఇతర సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సీతారాములతో కూడిన హనుమంతుని చిత్రపటం ముందు పారాయణం చేయాలి.