SIIMA Awards – Winners List : దుబాయ్ వేదికగా సైమా వేడుక ఘనంగా జరిగింది. ఈసందర్భంగా శుక్రవారం రాత్రి తెలుగు, కన్నడ భాషలకు చెందిన సినిమాలు, మూవీ ఆర్టిస్టులకు అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ సినిమా హవా నడిచింది. సైమా 2023లో అత్యధిక అవార్డులు అందుకున్న సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఈ సినిమాకుగానూ జూనియర్ ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ పురస్కారం వచ్చింది. డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ లను కూడా అవార్డులు వరించాయి. అయితే రాజమౌళి కుటుంబం ఈ వేడుకలకు హాజరు కాలేదు. రాజమౌళి తరఫున అవార్డును జూనియర్ ఎన్టీఆర్ అందుకోగా.. కీరవాణి తరఫున అవార్డును చంద్రబోస్ అందుకున్నారు. ఇక ఈ వేడుక సందర్భంగా జూనియర్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read : Latest Petrol Rates: వాహనదారులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
సైమా విజేతల లిస్టు ఇదే..
SIIMA అవార్డ్స్ తెలుగు విజేతల జాబితాను చూస్తే.. ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ (RRR మూవీ) ఎంపికయ్యారు. ఇక ఉత్తమ చిత్రంగా సీతా రామం సెలెక్ట్ అయింది. ఉత్తమ దర్శకుడిగా SS రాజమౌళి, ఫ్యాషన్ యూత్ ఐకాన్ గా శృతి హాసన్, ఉత్తమ నూతన నిర్మాతలుగా శరత్ – అనురాగ్ (మేజర్), ప్రామిసింగ్ న్యూకమర్ గా బెల్లంకొండ గణేష్, ఉత్తమ నూతన నటిగా మృణాల్ ఠాకూర్ (సీతా రామం), లీడ్ రోల్ లో ఉత్తమ నటుడిగా (క్రిటిక్స్) గా అడివి శేష్ (మేజర్), లీడ్ రోల్ లో ఉత్తమ నటిగా శ్రీలీల (ధమాకా), లీడ్ రోల్ లో ఉత్తమ నటి (క్రిటిక్స్) గా మృణాల్ ఠాకూర్ (సీతారామం) అవార్డులను అందుకున్నారు. గాయని గాయకులు రామ్ మిరియాల, మంగ్లీ సైతం పురస్కారాలు అందుకున్నారు. ఈ వేడుకలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా (SIIMA Awards – Winners List) నిలిచింది. ఆమె మొత్తం రెండు అవార్డులను అందుకున్నారు. రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ సైతం నృత్య ప్రదర్శనతో అలరించారు. కాగా, కన్నడ అవార్డుల్లో రిషబ్ శెట్టి ‘కాంతార’కు ఎక్కువ అవార్డులు వచ్చాయి.