Saripodhaa Sanivaaram OTT Release : నేచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయ (Nani – Vivke) కలయికలో వచ్చిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొల్పాగా..ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండడంతో సినీ లవర్స్ సినిమాను చూసేందుకు పోటీ పడ్డారు. విడుదల సమయం లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు ఉన్నప్పటికీ..బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం సినిమా సందడి నడిచింది. వర్షాలు తగ్గినా తర్వాత మరింతగా సినిమా చూసేందుకు ఎగబడ్డారు. దీంతో సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరి నాని ఖాతాలో బ్లాక్ బస్టర్ విజయం గా నిలిచింది. వెండితెర ఫై సూపర్ హిట్ గా నిలిచినా ఈ మూవీ..మరో 10 రోజుల్లో ఓటిటి లో సందడి చేయబోతుంది. ఈ నెల 26 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో Netflix లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటించగా కోలీవుడ్ స్టార్ ఎస్ జే సూర్య విలన్ గా నటించారు. జేక్స్ బి జోయ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అదరగొట్టేసింది. నాని (Nani) లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్నతో సూపర్ సక్సెస్ అందుకోగా ఇప్పుడు సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటె తాజాగా SIIMA అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా నాని అవార్డు అందుకున్నాడు.
సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)- 2024 అవార్డుల ప్రదానోత్సవం శనివారం (సెప్టెంబర్ 14) సాయంత్రం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తొలిరోజు కన్నడ, తెలుగు భాషల్లో ఎంపికైన చిత్రాలకు అవార్డులు పంపిణీ చేశారు. తమిళ, మలయాళ చిత్రాలకు ఆదివారం (సెప్టెంబర్ 15) అవార్డులు అందజేయనున్నారు. తెలుగు పురస్కారాలకు సంబంధించి ‘దసరా’, హాయ్ నాన్న, ‘బలగం’ చిత్రాలు ఎక్కువ అవార్డులు సాధించాయి. దసరా మూవీకి గాను ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ అవార్డులు అందుకున్నారు. బెస్ట్ మూవీ-భగవంత్ కేసరి, ఉత్తమ నేపథ్య గాయకుడు-రామ్ మిర్యాల (బలగం), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- బేబీ ఖియారా, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)-ఆనంద్ దేవరకొండ, బెస్ట్ కమెడియన్-విష్ణు (మ్యాడ్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్-అబ్దుల్ (హాయ్ నాన్న) అందుకున్నారు.
Read Also : 100 Days of Modi: మోడీ మొదటి 100 రోజుల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు