కాంబినేషన్ అదుర్స్ కదా.. విజయ్ దేవరకొండతో మైక్ టైసన్
బాక్సింగ్ అనగానే.. ప్రతిఒక్కరికి గుర్తుకువచ్చే పేరు మైక్ టైసన్. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో లెక్కలేని విజయాలను సొంతం చేసుకున్నారాయన. టైసన్ రింగ్ లోకి దిగితే.. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టాల్సిందే..
- By Balu J Published Date - 02:46 PM, Tue - 28 September 21

బాక్సింగ్ అనగానే.. ప్రతిఒక్కరికి గుర్తుకువచ్చే పేరు మైక్ టైసన్. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో లెక్కలేని విజయాలను సొంతం చేసుకున్నారాయన. టైసన్ రింగ్ లోకి దిగితే.. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టాల్సిందే.. వేదిక ఏదైనా మెడల్స్ కొల్లగొట్టడం టైసన్ ప్రత్యేకత. ఈ బాక్సింగ్ యోధుడు మొదటిసారి ఇండియన్ స్రీన్ పై కనిపించనున్నారు. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ చిత్రంలో మైక్ టైసన్ నటిస్తున్నాడు. చిత్ర నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. భారతీయ వెండితెరపై మైక్ టైసన్ ఓ సినిమాలో నటించడం ఇదే తొలిసారి. నమస్తే టైసన్ అంటూ స్వాగతం పలికింది. లైగర్ చిత్రం కోసం టైసన్ పై పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాగా ఈ మూవీలో విజయ్ దేవరకొండ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్ పాత్ర పోషిస్తున్నాడు.
ప్రస్తుతం, టీమ్ లిగర్ గోవాలో షూటింగ్ చేస్తున్నారు, ఇక్కడ కొన్ని హై- యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ అవుతున్నాయి. ఈ మూవీకి విష్ణు శర్మ కెమెరా వర్క్ నిర్వహిస్తుండగా, థాయ్‌లాండ్‌కు చెందిన నిపుణుడు కేచా స్టంట్ డైmick tison in liger movieరెక్టర్‌గా ఉన్నారు. విజయ్‌లో దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను విభిన్న పాత్రల్లో నటించారు. పాన్-ఇండియా చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలలో ఏకకాలంలో రూపొందుతోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాల ద్వారా విజయ్ దేవరకొండ మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇవాళ పూరి బర్తేడ్ సందర్భంగా లైగర్ నిర్మాతలలో ఒకరైన ఛార్మీ కౌర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. భారతీయ స్క్రీన్‌లపై మొదటిసారి, లెజెండరీ @మైకేటిసన్ మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #LIGER కోసం భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. పుట్టినరోజు కానుకగా #PURIJAGANNADH . @thedeverakonda పిచ్చిని అనుభవించడానికి వేచి ఉండలేను అంటూ ట్వీట్ చేశారు.
Get the Fireworks ready 🔥🔥🔥
2022!https://t.co/bYsuZFwCMQ #NamasteTYSON #LIGER pic.twitter.com/MqgcbNS4j7— Vijay Deverakonda (@TheDeverakonda) September 27, 2021
Related News

Karnataka Polls: ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లపై అమిత్ షా హాట్ కామెంట్స్
ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార పార్టీ బిజెపి, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో దూకుడు పెంచాయి