Site icon HashtagU Telugu

Guntur Karam Movie: మాస్ స్ట్రైక్‌… మంట రేపుతున్న “గుంటూరు కారం”

Guntur Karam Movie

New Web Story Copy 2023 05 31t194247.655

Guntur Karam Movie: `స‌న్న క‌ర్రా..స‌వ్వా దెబ్బా.. బొడ్డురాయి బెడ్డా దెబ్బా..ర‌వ్వా ర‌వ్వా..ఊయ్‌…అంటూ మాస్ బీట్‌తో గుంటూరు కారం ఫస్ట్ గ్లిమ్స్ సాగుతుంది. దివంగత సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన మహేష్ నెక్స్ట్ సినిమా అప్డేట్ యమ ఘాటుగా ఉంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రానికి సంబంధించి మేకర్స్ ఈ రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీకి గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేక‌ర్స్.

కొద్దిసేపటి క్రితమే టైటిల్ ని అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. అలా విడుదలైన కాసేపట్లోనే సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ప్రభంజనం మొదలైంది. ఎక్కడ చూసినా గుంటూరు కారం మంట రేపుతోంది. కొద్దిరోజుల క్రితం మహేశ్ బాబు ఫస్ట్ లుక్ విడుదలై సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ‘గుంటూరు కారం’ టైటిల్ తో ఘట్టమనేని ఫాన్స్ కిర్రెక్కిపోతున్నారు.

మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని కొన్ని డైలాగ్స్ టపాసుల్లా పేలుతున్నాయి. మహేష్ ఊర మాస్ లుక్ లో డైలాగ్స్ చెప్తుంటే పూనకాలు లోడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. `స‌న్న క‌ర్రా..స‌వ్వా దెబ్బా.. బొడ్డురాయి బెడ్డా దెబ్బా..ర‌వ్వా ర‌వ్వా..ఊయ్‌…అంటూ మాస్ బీట్‌తో మొద‌లై ఓ రేంజ్‌లో మాస్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. బీడీ తీసి.. ఏందీ అట్టా చూస్తున్నావ్‌.. బీడీ త్రీడీలో క‌న‌బ‌డుతోందా…` అంటూ మ‌హేష్ మాస్ పంచ్‌తో అద‌ర‌గొట్ట‌డం…పంచ్‌కే జీప్ గాల్లోకి ఎగ‌ర‌డం.. వంటి సీన్లు.. మ‌హేష్ మేకోవ‌ర్‌, యాటిట్యూడ్ చూస్తుంటే మ‌ళ్లీ ఒక్క‌డు, పోకిరి నాటి రోజుల్ని గుర్తు చేస్తోంది.

Read More: Bhaag Mantri Bhaag: కేంద్ర మంత్రి మీనాక్షి పరుగో పరుగు.. కేటీఆర్ ఫన్నీ ట్వీట్