మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో మంచి దోస్తులు. ఈ ఇద్దరు స్టార్స్ ఎలాంటి బేదాభిప్రాయాలకు పోకుండా ఒకరిపై మరొకరు ప్రేమను చాటుతుంటారు. ఇక బర్త్ డే వేడుకల్లో కూడా ఈ ఇద్దరు స్టార్స్ కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అందుకే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి వీరిద్దరి ఫ్రెండ్ షిప్ కారణమని చెప్పక తప్పదు.
చరణ్, ఎన్టీఆర్ (Jr NTR) మధ్య మంచి బాండింగ్ ఉండటంతోనే రాజమౌళి ఆస్కార్ కొట్టే సినిమాను తెరకెక్కించాడు అనడంలో సందేహం లేదు. అయితే గతకొంతకాలంగా ఈ ఆర్ఆర్ఆర్ దోస్తుల మధ్య గ్యాప్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘RRR’ లో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ తెల్లటి హోండా యాక్టివా స్కూటర్‌పై రైడ్ చేసిన వీడియో అందర్నీ ఆకర్షిస్తోంది.
ఈ వీడియోలో రామ్ చరణ్ బిజీ షూటింగ్ కారణంగా సరదాగా హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టడానికి ఆసక్తి చూపాడు. కార్వాన్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు స్కూటీపై వెళ్లాడు. ఇక ఎన్టీఆర్ రైడ్ కు ఆసక్తి చూసిస్తూ డ్రైవ్ చేస్తూ ముందుకు పొనిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇద్దరి హీరోల అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆర్ఆర్ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుతున్న సమయంలో కాస్తా బ్రేక్ తీసుకోడానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ అలా హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఈ వీడియో చరణ్, తారక్ మధ్య బలమైన స్నేహానికో ఉదారహణగా నిలుస్తుందంటున్నారు అభిమానులు.
Also Read: The Kerala Story: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ది కేరళ స్టోరీ, 200 కోట్ల దిశగా!