Site icon HashtagU Telugu

Johnny Master Wife : పోలీస్ విచారణకు హాజరైన జానీ మాస్టర్ భార్య

Johany Master Wife

Johany Master Wife

Johnny Master’s wife attended the police investigation : అత్యాచార కేసులో జానీ మాస్టర్ తో పాటు అతని భార్య అయేషా (సుమలత) పేరును బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణ నిమిత్తం ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు ఆమెను కేసు విషయమై ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood ) లో జానీ మాస్టర్ (Jani Master) ఫై లైంగిక కేసు నమోదు కావడం పై పెద్ద దుమారం రేపుతుంది.

ఇప్పటికే ఫిలిం ఛాంబర్ జానీ ఫై పలు ఆంక్షలు విధించింది. మరోపక్క ఇండస్ట్రీ లో దీని గురించి ఓపెన్ అవుతూ బయటకు వస్తున్నారు. ఇప్పటీకే పలువురు స్పందించడం జరిగింది. గత నాల్గు రోజులుగా పోలీసులకు దొకరకుండా తప్పించుకు తిరుగుతున్న జానీ ని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. బెంగళూరు ఎయిరోపోర్టు సమీపంలో ఈయన్ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు.

జానీ మాస్టర్ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ నాల్గు రోజుల క్రితం పిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. 2019 నుంచి తనపై జానీ వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది. ఢీ షో ద్వారా జానీ మాస్టర్ పరిచయం అయ్యారని.. ఆ తర్వాత తనను ఆయన టీంలో చేర్చుకున్నారని తెలిపింది. ఔట్‌ డోర్ షూటింగ్ పేరుతో చెన్నై, ముంబై ,హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో… జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ప్రతిఘటిస్తే తీవ్రంగా దాడి చేశాడని బాధితురాలు తెలిపింది. షూటింగ్ స్పాట్‌లోనూ వదిలేవాడు కాదని.. కార్వాన్‌లోకి లాక్కెళ్లి.. ప్యాంట్ జిప్ తీసి.. చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో పేర్కొంది.

తను చెప్పిన దానికి అంగీకరించకపోతే.. అద్దానికి తన తల బాదేవాడని.. తీవ్రంగా దాడి చేసేవాడని.. ఇండస్ట్రీ లో ఛాన్సులు లేకుండా చేస్తానని బెదిరించే వాడని ఫిర్యాదులో తెలిపింది. జానీ మాస్టర్‌ ఎన్ని దారుణాలు చేసినా.. ఆయనకు ఎప్పుడూ తను లొంగిపోలేదని రాసుకొచ్చింది. మతం మార్చుకొని.. తనను పెళ్లి చేసుకోవాలని జాన్ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడని.. జానీ మాస్టర్‌కు ఆయన భార్య కూడా సహకరించేదని.. వాపోయింది. ఇంటికి వచ్చి మరీ ఆమె తనపై దాడి చేసిందని తెలిపింది. ఈమె పిర్యాదు తో జానీ మాస్టర్ తో పాటు అతడి భార్య ఫై కేసులు నమోదు చేసారు. ప్రస్తుతం ఆమెను నార్సింగి పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు.

Read Also : NTR – Atlee : అట్లీతో ఎన్టీఆర్ సినిమా.. ఆల్రెడీ కథ కూడా విన్నాను.. కానీ..