సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన సినీ నటుడు అల్లు అర్జున్ను (Allu Arjun) పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి (Gandhi hospital ) తరలించారు. ఈ ప్రక్రియ తర్వాత ఆయనను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గాంధీ ఆస్పత్రిలో అల్లు అర్జున్ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరీక్షించి, తగిన నివేదిక సిద్ధం చేయనున్నారు. అరెస్టు సమయంలో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించడం న్యాయపరమైన విధిగా ఉండటంతో, ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఆస్పత్రికి చేరుకున్న సమాచారం తెలియగానే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ హీరోకు న్యాయం చేయాలని అభిమానులు ప్లకార్డులతో నినాదాలు చేస్తున్నారు. ఈ అరెస్టు, వైద్య పరీక్షలు, కోర్టు విచారణ వంటి పరిణామాలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి తన వాదనను కోర్టులో ఎలా చెప్పుకుంటారు..? జడ్జ్ ఏ విధంగా స్పందిస్తారు..? ఒకవేళ రిమాండ్ కు తరలిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి..? కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగే ఛాన్స్ ఉందా..? అనేది ఆసక్తి రేపుతోంది. మరోపక్క అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసే సమయంలో కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే ఛాన్స్ కూడా పోలీసులు ఇవ్వకపోవడం పట్ల అల్లు అర్జున్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసారు.
అసలు ఏంజరిగిందంటే..
‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లలోని సంధ్య థియేటర్ ( Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా..ఆమె కుమారుడు మృతువుతో పోరాడుతున్నాడు. ఈమె మరణానికి కారణం..అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడమే. పుష్ప మూవీ తో అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ కి పెరిగిందో తెలియంది కాదు..రెండేళ్లు గా పుష్ప 2 కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సినిమా హైప్ ను మరింత పెంచేలా దేవి సాంగ్స్ ఇవ్వడం..అదే రీతిలో మేకర్స్ ప్రమోషన్ చేయడంతో సినిమాను చూడాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఈ ఆసక్తి తగ్గట్లే సినిమాను పాన్ ఇండియా గా భారీ ఎత్తున అనేక భాషల్లో విడుదల చేసారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ థియేటర్స్ లలో రిలీజ్ చేయడం తో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా టికెట్స్ ధరలు పెంచారు.
కాగా డిసెంబర్ 04 న సంధ్య థియేటర్ ( Sandhya Theatre) లో ప్రీమియర్ షో వేయడం జరిగింది. అయితే ఈ ప్రీమియర్ షో కు అల్లు అర్జున్ వస్తారని ముందే ప్రకటించే సరికి అల్లు అర్జున్ చూడాలని చెప్పి వేలాదిమంది అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. వారిలో రేవంతి అనే మహిళ కూడా ఒకరు. తన కుమారుడికి అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం కావడంతో ప్రీమియర్ షో చూసేందుకు కుమారున్ని తీసుకోని సంధ్య థియేటర్ కు వచ్చింది. ఇదే క్రమంలో అల్లు అర్జున్ రావడం తో అతడ్ని చూసేందుకు పోటీపడింది. ఈ క్రమంలో భారీగా వచ్చిన అభిమానులను నిలువరించేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ సమయంలో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగి, ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రేవతి మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ ఫై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. తన భార్య చావుకు కారణం వీరే అని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు థియేటర్ యజమాని తో పాటు మేనేజర్ ను అరెస్ట్ చేశారు. ఈరోజు అల్లు అర్జున్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాసేపట్లో ఆయన్ను కోర్ట్ లో హాజరు పరచనున్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్లు 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS చట్టాల కింద అభియోగాలు మోపారు. కేసు రుజువైతే ఆయనకు కనీసం పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసు తీవ్రత, సంబంధిత సెక్షన్ల ప్రకారం శిక్ష కఠినంగా ఉండవచ్చని వారు అంటున్నారు.
సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ .. #AlluArjun #sandhya70mm #sandhyatheatre #sandhya35mm #Pushpa2TheRule #HashtagU pic.twitter.com/E4AE9OfaUH
— Hashtag U (@HashtaguIn) December 13, 2024
Read Also : Weather Updates : ములుగులో చలి పులి.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు