HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold And Silver Prices Falling Day By Day

Gold Rates: రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి ధరలు..

  • Author : Vamsi Chowdary Korata Date : 09-06-2026 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Prices
Gold Prices

పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు, ఒక్కసారిగా పెరగడం గమనార్హం. దాదాపు 10 రోజుల తర్వాత బంగారం ధరలు పెరిగాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో క్రూడాయిల్ ధరలు తగ్గాయి. దీంతో మళ్లీ బంగారం ధరలు ఎగబాకాయి. వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి సడెన్ షాక్ తగిలింది. గత 10 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు దానికి బ్రేక్ పడింది. జూన్ 9న ఒక్కసారిగా ధరలు ఎగబాకాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్థిరంగానే ఉన్నప్పటికీ.. దేశీయంగా ధరలు పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశీయంగా హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1350 పెరిగింది. దీంతో తులం పసిడి ధర ఇప్పుడు రూ. 1,40,400 కు చేరింది. దీనికి ముందు చూస్తే వరుసగా రూ. 950, రూ. 2750, రూ. 350, రూ. 100, రూ. 750 ఇలా గత 10 రోజుల్లో తగ్గుముఖం పట్టాయి. అంటే ఇప్పుడు దాదాపు 10 రోజుల తర్వాత బంగారం ధరలు పెరిగాయన్నమాట.

మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే హైదరాబాద్ నగరంలో రూ. 1470 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,53,160 వద్ద ట్రేడవుతోంది. ఇది గత 10 రోజుల వ్యవధిలో రూ. 5 వేలకు పైగా తగ్గిందని చెప్పొచ్చు. బంగారం ధరలు పెరిగినప్పటికీ మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సిల్వర్ రేటు కేజీకి రూ. 2.70 లక్షల వద్ద స్థిరంగానే కొనసాగుతోంది. వెండి ధర చూస్తే చాలా రోజులుగా పెరగకుండా స్థిరంగానే ఉంటూ వస్తోంది. జూన్ 4, 5, 6 తేదీల్లో కలిపి రూ. 20 వేల మేర తగ్గడం విశేషం.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. గత రోజుతో పోలిస్తే పెద్దగా మారలేదు. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4330 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సిల్వర్ రేటు చూస్తే 68 డాలర్ల వద్దే ఉంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా క్షీణించి రూ. 95.65 వద్ద ఉంది.

ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం క్రూడాయిల్ ధరలు తగ్గడం. అవును.. గత రెండు రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరగగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ జరిగింది. దీంతో క్రూడాయిల్ ధరలు గరిష్ట స్థాయిల నుంచి తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 93 డాలర్లకు దిగొచ్చింది. సాధారణంగానే క్రూడాయిల్ ధరలు తగ్గితే.. బంగారానికి డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతుంటాయి. ఇప్పుడు అదే జరిగింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 24 carat gold rate today
  • 24K gold price
  • 24K gold price in India
  • Daily gold price
  • gold sliver
  • sliver price

Related News

    Latest News

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd