Site icon HashtagU Telugu

YSRCP : నాలుగు సిద్దం సమావేశాలకు 600 కోట్లు..?

Jagan Sharmila

Jagan Sharmila

ఏపీలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అధినేతలు వ్యూహలు పన్నుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) ఇటీవల సిద్ధం పేరిట బహిరంగ సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. నిన్న చివరి సిద్ధం సభ మేదరమెట్లలో జరిగింది. అయితే.. సిద్ధం సభ ఏర్పాట్ల ఖర్చులపై నెట్టింట చర్చల మొదలైంది. ఈ సిద్ధం సభలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ మొత్తంలో ఖర్చులు చేసిందని… ఈ స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు ఇంత మొత్తం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం చర్చకు దారి తీసింది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆరోపిస్తూ భారీ మొత్తంలో “సిద్ధం” సభలకు వైసీపీ రూ.600 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. నిన్న బాపట్ల జిల్లా మేదరమెట్ల గ్రామంలో నాల్గవ “సిద్ధం” సభ జరిగింది. ఎన్నికలకు ముందు ఇదే ఆఖరి సిద్దం కార్యక్రమం. అయితే.. మీడియాతో షర్మిల మాట్లాడుతూ.. జగన్ కు దాదాపు ఒక్క ఈవెంట్‌కు రూ.90 కోట్లు, మొత్తం అన్ని సిద్ధం సమావేశాలకు రూ. 600 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఆయనకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. బీజేపీకి జగన్ రహస్య మిత్రుడని షర్మిల విమర్శించారు. ఆయనపై ఈడీ కేసు రాకపోవడానికి కారణమేంటని, ఆయన అవినీతి కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ దర్యాప్తు చేయదని వివరించింది. బీజేపీ ప్రత్యర్థులపై మాత్రమే ఈడీ దాడులు చేస్తుందని, మిత్రపక్షాలపై కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా జగన్ ఎందుకు పోరాడలేదని ఆమె ప్రశ్నించారు. ఇదిలా ఉండగా షర్మిల చేసిన “600 కోట్లు” ఇప్పుడు సోషల్ మీడియాలో ఏపీ ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది.

Read Also : TDP BJP Janasena Meeting: చంద్రబాబు ఇంట్లో జనసేన, బీజేపీ కీలక భేటీ