ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 96 ఏళ్ల వృద్ధుడి జీవితకాల కోరికను నెరవేర్చి, తన మానవత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు, తన అభిమాన నేత అయిన చంద్రబాబును కలవాలని చిరకాలంగా ఆశిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి, సోమవారం తన జిల్లా పర్యటనలో భాగంగా ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకున్నారు.
ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో తన అభిమాని సత్యనారాయణతో ముఖ్యమంత్రి శ్రీ నాారా చంద్రబాబు నాయుడు గారు pic.twitter.com/WdXlq1gKfK
— Telugu Desam Party (@JaiTDP) June 8, 2026
ఈ సమావేశం అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. సత్యనారాయణను చంద్రబాబు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన నూరేళ్లు నిండు ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరువురూ కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన ఆనందంలో సత్యనారాయణ స్పందిస్తూ “ఇక రెండు రోజులు భోజనం చేయకపోయినా పర్వాలేదు, నా మనసు నిండిపోయింది” అని ఆనందం వ్యక్తం చేశారు. నాయకుడికి, అభిమానికి మధ్య ఉన్న ఈ అనుబంధాన్ని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పెద్దాయన కల నెరవేర్చిన ప్రజా నాయకుడు..
"సత్యనారాయణ గారు… మనం రేపు సిద్దాంతంలో కలుద్దాం!" అని నిన్న చంద్రబాబు గారు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, సిద్దాంతం వచ్చి సత్యనారాయణ గారిని కలిసి ఆయన కోరిక నెరవేర్చటమే కాదు, కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, అండగా నిలుస్తానని… pic.twitter.com/hqyEBSE7vk
— Telugu Desam Party (@JaiTDP) June 8, 2026
ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు సవరించిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. తన అధికారిక కార్యక్రమాల ఒత్తిడిలోనూ సమయం కేటాయించి, ఒక సామాన్య అభిమాని కోరికను తీర్చడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
