Site icon HashtagU Telugu

Vangalapudi Anitha Arrest : చంద్రబాబుకు రాఖి కట్టేందుకు వెళ్తున్న వంగలపూడి అనితను అడ్డుకున్న పోలీసులు

Vangalapudi Anitha Arrest

Vangalapudi Anitha Arrest

తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు విజయవాడ రైల్వే స్టేషన్ లో చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ అధినేత చంద్రబాబు కు రాఖీ కట్టేందుకు వెళ్తతుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆమె వాపోతుంది. రాఖీ సందర్భంగా రాష్ట్రంలోని మహిళల రక్షణపై కీలక ఉపన్యాసం చేయనున్న తరుణంలో జగన్ ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర మహిళలను నిర్భందించడం సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ‘మహాశక్తి కవచం’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లేందుకు వంగలపూడి అనిత రైల్లో విజయవాడ వచ్చారు. అనితను విజయవాడ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్‌లో ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకుని మంగళగిరికి వెళ్లకుండా నిర్భంధించారు. తాను ఎలాంటి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనని రాతపూర్వకంగా ఇస్తానని చెప్పినా అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం లేకుండానే తనను నిర్బంధించారని అనిత ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో అధినేత చంద్రబాబు నాయుడుకి రాఖీ కట్టాలని పోలీసులకు వివరించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also : TCongress: టీకాంగ్రెస్ లో టికెట్ల లొల్లి, ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్న నేతలు

మరోపక్క ఏపీలో వైసీపీ ఇసుక దోపిడిపై టీడీపీ పోరుబాట చేపట్టింది. గత రెండు రోజులుగా ఇసుక రీచ్‌లు, మండల కేంద్రాల వద్ద సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది. ఈరోజు(బుధవారం) రాష్ట్ర మైనింగ్ కార్యాలయంలో వైసీపి దోపిడీ విధానంపై వినతి పత్రాన్ని అందించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించారు. అయితే ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర మైనింగ్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు ఎక్కడిక్కడే టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో అయినా మైనింగ్ కార్యాలయానికి వెళ్లి తమ నిరసన వ్యక్తం చేస్తామని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.