Site icon HashtagU Telugu

Seven Workers Dead: కాకినాడ జిల్లాలో విషాదం.. ఏడుగురు కార్మికులు మృతి

Seven Workers Dead

Kkd

కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం జీ.రాగంపేటలో గల ఆయిల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు (Seven Workers Dead) మృతి చెందారు. అంబటి ఆయిల్స్ నువ్వుల నూనె పరిశ్రమలో గురువారం ఆయిల్ ట్యాంక్ శుభ్రపరుస్తున్న ఏడుగురు కార్మికులు ఊపిరాడకపోవడంతో శుభ్రం చేస్తున్న ట్యాంక్ లోనే కుప్పకూలి దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  ఒకరిని కాపాడేందుకు మరొకరు లోపలికి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు పాడేరుకు చెందినవారు కాగా.. మరో ఇద్దరిని పులిమేరు వాసులుగా గుర్తించారు.  ప్రమాదానికి గల కారణాలు అన్వేషించే పనిలో పోలీసులు, అధికారులు ఉన్నారు.  మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: Sexually Assaulting: ఢిల్లీలో ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు