TDP Leaders – House Arrests : ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల కట్టడికి పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో చాలాచోట్ల టీడీపీ నేతల గృహనిర్బంధాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు బెయిల్ విషయంలో ఏసీబీ కోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ లీడర్లు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపకుండా వారిని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. గుంటూరులో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను, వైజాగ్ పరిధిలోని వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచారు. ఇతర జిల్లాల్లోనూ ఇలాగే టీడీపీ కీలక నేతలను హౌస్ అరెస్టు చేశారు.
Also read : ACB Court: బాబు A-1 కాదు.. A-37, స్కామ్ లో చంద్రబాబు పాత్ర కీలకం: సీఐడీ తరుపు న్యాయవాది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను సీఐడీ అధికారులు ఇవాళ ఉదయం 6 గంటలకు విజయవాడలోని ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరుపరిచారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇటీవల ఏ-35ని అరెస్ట్ చేశాం. ఏ-35 రిమాండ్ ను ఇదే కోర్ట్ తిరస్కరిస్తే.. హైకోర్ట్ రిమాండ్ విధించిందన్నారు. 2015లోనే ఈ స్కామ్ మొదలయింది అని, ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గతంలో అరెస్ట్ చేసిన 8 మంది పాత్ర ఎంతో ఉందో.. చంద్రబాబు పాత్ర అంతకుమించి ఉంది అని పొన్నవోలు కోర్టుకు వివరించారు. వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో గంటలోగా చంద్రబాబుకు బెయిల్ మంజూరవుతుందా ? లేదా ? అనే దానిపై కోర్టు ఆర్డర్స్ తో క్లారిటీ రానుంది.