Site icon HashtagU Telugu

Ayyanna Patrudu : యువగళం సభలో సీఎం జగన్ ఫై రెచ్చిపోయిన అయ్యన్నపాత్రుడు

Ayyanna patrudu comments to cm jagan

Ayyanna patrudu comments to cm jagan

గన్నవరం లో ఏర్పాటు చేసిన యువగళం భారీ బహిరంగ సభ (Yuvagalam Public Meeting) లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) సీఎం జగన్ (CM Jagan) ఫై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. జగన్ ఫై తనలో ఉన్న కోపాన్నంతా సభ వేదిక(Gannavaram)గా వెళ్లగక్కినట్లు ఆయన మాటలు వింటే తెలుస్తుంది. మన శత్రువు ఫై ఎలాగైతే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతామో అదే విధంగా అయ్యన్న..సీఎం జగన్ ఫై మాటల తూటాలు పేల్చారు.

సీఎం అనే గౌరవం కూడా ఇవ్వకుండా బండ బూతులే అన్నారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ఏం చేశారురా నా కొడకల్లారా? ..సీఎం ఓ నత్తి నా కొడుకు. రాజమహేంద్రవరం అని కూడా పలకలేడు. ముసలి వాళ్లని, భర్త పోయిన ఆడవాళ్లను మోసం చేసిన దుర్మార్గపు నా కొడుకు జగన్. వైన్ షాపుల్లేకుండా చేస్తానని, వైన్ షాపుల మీదే అప్పులు చేశాడు జగన్. వీడు ఆరు నెలల్లో జైలుకెళ్తాడంటూ అయ్యన్న చెప్పుకొచ్చాడు.

కేంద్ర నిధులతో జగన్ ఇళ్లను నిర్మిస్తున్నారని, మోడీ(PM Modi)కి కొడుకు పుడితే జగన్ ముద్దు పెట్టుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ చిన్న దొంగ కాదని, చాలా పెద్ద దొంగ అని , జగన్ అర్థిక ఉగ్రవాదని, ధన పిశాచని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద సీబీఐ 13, ఈడీ 9, ఇతర కేసులు 9 ఉన్నాయని అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ ఆ రోజు పాదయాత్ర చేయడం కాదురా.. ఇప్పుడు చేయ్. నువ్వు పాదయాత్ర చేస్తే మగాళ్లు కాదు. ఆడాళ్లే కొడతారు అని అయ్యన్న అన్నారు. 18 సార్లు జగన్ ఢిల్లీకి వెళ్లి ఏం చేసాడని ప్రశ్నించారు. మోడీ గదిలోకి వెళ్లి జగన్ ఏం చేస్తున్నాడు? ప్రత్యేక హోదా అడుగుతున్నాడా? లేక పిసికేస్తున్నాడా?’’ అంటూ అయ్యన్న పాత్రుడు ఘాటు వ్యాఖ్యలే చేసారు. అయ్యన్న మాటలకు వేదిక ఫై ఉన్న టీడీపీ నేతలే కాదు సభ కు వచ్చిన జనాలు..టీవీ లలో చూస్తున్న ప్రజలు నవ్వుకున్నారు. ఈ రేంజ్ లో ఏ సీఎం ను అన్నారు కావొచ్చని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

మాములుగా సీఎం జగన్ ఓ చిన్న మాట అంటేనే వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి కౌంటర్లు ఇస్తారు..మరి అయ్యన్న ఈ రేంజ్ లో మాటల తూటాలు పేల్చాడు కాబట్టి వైసీపీ నేతల రియాక్షన్ గట్టిగానే ఉంటుందని అంత భావిస్తున్నారు.

Read Also : Kottu Satyanarayana : దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రెస్ మీట్.. మరిన్ని ఆలయాలు దేవాదాయ శాఖలోకి..