HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Steel Plant Incident Pawan Kalyan Consoles The Victims

Pawan Kalyan: స్టీల్‌ ప్లాంట్‌ ఘటన..బాధితులకు పరామర్శ పవన్‌ కల్యాణ్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 09-06-2026 - 1:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Steel Plant incident: Pawan Kalyan consoles the victims.
Steel Plant incident: Pawan Kalyan consoles the victims.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖకు చేరుకున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులను స్వయంగా అడిగి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్‌లోని ప్రమాద స్థలాన్ని పరిశీలించి యాజమాన్యం, ఉన్నతాధికారులతో మాట్లాడారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్‌ హామీ ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.1.72 కోట్లు, ఒప్పంద కార్మికుల కుటుంబాలకు రూ.45.75 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. దీనితో పాటు మరణించిన వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. గాయపడిన వారికి రూ.10 లక్షల తక్షణ సాయంతో పాటు చికిత్సకయ్యే పూర్తి ఖర్చులను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ భరిస్తుందని వెల్లడించారు.

గత 30 ఏళ్లలో ఇలాంటి ఘోర దుర్ఘటన జరగలేదని పవన్ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రి కూడా ప్లాంట్‌లో ఇలాంటి చిన్న సాంకేతిక లోపం తలెత్తిందని, అయితే రాత్రి వేళ కార్మికులు ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికీ తెలియలేదని తన దృష్టికి తెచ్చారని ఆయన వివరించారు. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు, యంత్రాల ఆధునికీకరణపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని, వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై, వారి భద్రతపై త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్వయంగా కార్మికులతో మాట్లాడతానని పవన్‌ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం బాధపడి వదిలేయకుండా.. ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు యాజమాన్యం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Deputy CM Pawan kalyan
  • RINL Accident Compensation
  • vizag steel plant

Related News

CM Chandrababu and Pawan Kalyan head to Delhi!

Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి ఆయన ఢిల్లీలో పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు

  • CM Chandrababu: Chandrababu Responds to Pawan's Meeting in Telangana

    CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena will contest in Telangana.

    Janasena Party: తెలంగాణలో జనసేన పోటీ చేస్తాం

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Latest News

  • Bhatti Vikramarka: బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఫైర్

  • Visakhapatnam Steel Plant: కన్నీళ్లు పెట్టిస్తున్న స్టీల్ ప్లాంట్ బాధితుడు.. తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకో డాడీ

  • Hardik Pandya: ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌ కు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌

  • Pawan Kalyan: స్టీల్‌ ప్లాంట్‌ ఘటన..బాధితులకు పరామర్శ పవన్‌ కల్యాణ్‌

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd