Site icon HashtagU Telugu

Tomato Theft: టమాటా రైతుపై దాడి, 4.5 లక్షలు దోచుకెళ్లిన దుండగుడు

Tomato Donga

Tomato Donga

టమాటా ధరలకు రెక్కలు రావడంతో రైతులపై దాడులు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టమాట దొంగతనాల కేసులు నమోదవుతున్నాయి. ధరలు పెరిగిపోతుండటం దొంగలకు వరంగా మారింది. దీంతో టమాటాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు.  ఏపీలోని పుంగనూరు నియోజకవర్గం నక్కబండ గ్రామంలో టమాటా రైతుపై గుర్తు తెలియని యువకుడు దాడి చేసి 4.5 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ఇటీవల వెలుగుచూసింది.

పలమనేరు మార్కెట్‌లో రైతు లోకరాజ్‌ తన టమోటా పంటను విక్రయించాడు. అతను ఇంటికి తిరిగి వస్తుండగా గంజాయి మత్తులో ఉన్న దుండగుడు బీరు బాటిళ్లతో రైతుపై దాడి చేసి నగదు ఎత్తుకెళ్లారు. స్థానికులు అతడిని పుంగనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెలలో అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బోడుమల్లదిన్నె గ్రామంలో టమోటా రైతు ఎన్.రాజశేఖర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. స్థానిక మార్కెట్‌ యార్డులో టమాటా అమ్మగా 30 లక్షలు రావడంతో రైతు టార్గెట్‌ అయ్యాడు.

పుంగనూరు మండలం నెక్కుండి గ్రామంలో ఉదయ్‌కుమార్‌కు చెందిన పొలంలో సుమారు 400 కిలోల టమోటాలను దొంగలు అపహరించారు. అదే విధంగా మదనపల్లిలోని ఓ దుకాణాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు 50 కిలోల టమాటాతో ఉడాయించారు. టమోటా రైతులు ఈ ప్రాంతంలో తమ మరియు వారి పంట భద్రత గురించి జాగ్రత్తగా ఉన్నారు.

Also Read: Minister KTR: జర్నలిస్టులకు ఇండ్ల‌ స్థలాలు ఇస్తాం: మంత్రి కేటీఆర్