Site icon HashtagU Telugu

AP : ఏసీబీ కోర్ట్ ఎదుట భారీగా కాన్వాయ్ సిద్ధం..ఏంజరగబోతుంది..?

Security heightened outside ACB Court

Security heightened outside ACB Court

ఏసీబీ కోర్ట్ లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం (Skill Development Case) కేసు కు సంబదించిన చంద్రభాను విచారణ జరుగుతుండగా..కోర్ట్ బయట భారీ ఎత్తున కాన్వాయ్ ఏర్పాటు చేస్తుండడం టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) ను అరెస్ట్ చేసిన సీఐడీ (CID)..నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ఉదయం నుండి వాదనలు కొనసాగుతున్నాయి. ఏపీ సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్ రెడ్డి టీమ్ వాదనలు వినిపిస్తుండగా, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపిస్తున్నారు.

ఈ క్రమంలో కోర్టు బయట వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అక్కడున్న పోలీసులకు తోడుగా అదనపు బలగాలు చేరుకున్నాయి. కోర్టు ముందు పోలీసులు భారీ కాన్వాయ్ మొహరించారు. ఓవైపు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే బయట పోలీసులు చేస్తున్న హడావుడి చూసి ఏంజరగబోతోందని టీడీపీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. అయితే, కోర్టు విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ముందు జాగ్రత్త చర్యగానే బలగాలను మోహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. వాదనలు పూర్తికాగానే మధ్యాహ్నం 3 గంటలకు తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెయిల్ రావాలంటూ టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు.

Read Also : Lawyer Sidharth Luthra : ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరుపున సిద్ధార్థ్ లూత్రా చేసిన వాదనలు ఇవే..

ఈ కేసు విచారణ కోసం చంద్రబాబును 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి అనుమతిస్తే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసారు. అంతేకాదు.. విజయవాడలోని కోర్టు ఆవరణ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు ఉన్న వివిధ మార్గాలను క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మాత్రం కోర్టు పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించకపోవడం, అరకిలోమీటరు దూరంలో బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.