ఏపీలో వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఇంటి ముందుకు వచ్చి ఎవరు డేటా అడిగిన ప్రజలు ఎదురుతిరుగుతున్నారు. మొన్నటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి ఓ లెక్క అని సమాధానం ఇస్తున్నారు. తాజాగా ఈ విషయాన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసాడు.
రాష్ట్రంలో వైస్సార్సీపీ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ (AP Volunteer) లో లోపాలు ఉన్నాయని , ప్రజల రహస్య డేటా ను వారు స్వీకరిస్తున్నారని రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసారు. రాష్ట్ర ప్రజల డేటా అంత హైదరాబాద్ లోని నానక్ రామ గూడా లోని ప్రవైట్ సంస్థ చేతికి అప్పగించారని , ఆలా ప్రజల రహస్య డేటా తో వారికీ ఏంపని అని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం లోకి వస్తే 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని జగన్..ఈరోజు రాష్ట్రంలో ఇంటర్ , డిగ్రీ, బిటెక్ చదివిన విద్యార్థిని , విద్యార్థులను రోజుకు రూ.164 ఇస్తూ ప్రజల డేటాను సేకరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై వైస్సార్సీపీ (YSRCP) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ తెలిపిన విషయాలు ఇప్పుడు ప్రజలను ఆలోచనలో పడేశాయి. ఎవరు ఇంటి ముందుకు వచ్చి డేటా అడిగిన వారిపై తిరగపడుతున్నారు. అసలు నువ్వు ఎవరు..మా వివరాలతో నీకేంటి పని అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా దీనిని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
ఏ ప్రభుత్వ శాఖకు చెందని వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత, @PawanKalyan గారు డేటా లీకేజీ అంశంపై నిజాలు బయటపెట్టడంతో ప్రశ్నించడంతో మొదలుపెట్టిన ప్రజలు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు @YSRCParty పై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్దంగా ఉండు జగన్ అంటూ పవన్ ట్వీట్ చేశారు.
ఏ ప్రభుత్వ శాఖకు చెందని వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత, @PawanKalyan గారు డేటా లీకేజీ అంశంపై నిజాలు బయటపెట్టడంతో ప్రశ్నించడంతో మొదలుపెట్టిన ప్రజలు.
త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు @YSRCParty పై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్దంగా ఉండు జగన్… pic.twitter.com/T7yuV6WUZz
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 21, 2023
Read Also : Allu Arjun : తెలుగు వారికీ ఛాన్స్ ఇస్తే కదా..ఇండస్ట్రీ లోకి వచ్చేది..?