Site icon HashtagU Telugu

AP : పవన్ కళ్యాణ్ ఫై పోటీ చేస్తారా..? పోసాని దిమ్మతిరిగే సమాధానం

Posani Krishna Murali Comments On Pawan Kalyan

Posani Krishna Murali Comments On Pawan Kalyan

ప్రముఖ నటుడు , ఏపీ చలనచిత్రాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali)…గత నాల్గు రోజులుగా మీడియా లో హైలైట్ అవుతూ వస్తున్నాడు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలో ఎలాంటి పంచ్ డైలాగ్స్ రాస్తాడో..రాజకీయాల్లో కూడా తన మార్క్ విమర్శలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం వైసీపీ (YCP) లో ఉన్న ఈయన..నాల్గు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) , ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) లపై నిప్పులు చెరుగుతూ వస్తున్నాడు. లోకేష్ తన హత్య కు ప్లాన్ చేస్తున్నాడని..ఏకంగా డిజిపి ని కలిసి పిర్యాదు చేసాడు. అంతే కాదు సొంత మామను పొడిచినోడికి… పవన్ కల్యాణ్ ఒక లెక్కా అన్నస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also : Telangana BJP : నిజంగానే వీరంతా బిజెపిని వీడితే పరిస్థితి ఏంటి..?

ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై పోటీ చేస్తారా..? అని మీడియా వారు అడుగా..దానికి తనదైన స్టయిల్ లో సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఫై పోటీ చేయడానికి నేనేమైన పిచ్చోడినా..? అని ఎదురుప్రశ్న వేశారు. “పవన్ కళ్యాణ్‌ పై పోటీ చేయమని నాకు సీటు ఇస్తే ఖచ్చితంగా పోటీ చేయను. నేనేం అంత అమాయకుడ్ని కాదు.. పిచ్చోడ్ని అంతకంటే కాదు.. పవన్ కళ్యాణ్‌ పై నేను పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు.. అలాంటప్పుడు నేనెందుకు పోటీ చేస్తాను. పవన్ కళ్యాణ్ టాప్ స్టార్. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ ని. అతి సామాన్యుడ్ని. అసలు నేను పవన్ కళ్యాణ్‌ పై ఎలా నిలబడతాను. ఆయనకి నాకు పోలికే లేదు. చచ్చినా నేను గెలవలేను. డిపాజిట్లు కూడా రావు..” అని స్పష్టం చేసారు.