విశాఖపట్నం (Vizag)లో గొడవ జరిగిన సమయంలో చంద్రబాబు గారు నాకు మద్దతు తెలిపారు. తిరిగి నేను స్పందించడం అనేది సంస్కారం. నా కోసం నిలబడిన వ్యక్తికి నేను మద్దతు ఇవ్వడం నా బాధ్యత అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం (Skill Development Case) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) కు ఏసీబీ కోర్ట్ (ACB Court) 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ తీర్పుతో యావత్ తెలుగు ప్రజానీకం షాక్ కు గురవుతుంది. చంద్రబాబు ను అరెస్ట్ చేయడమే తప్పు అంటే..ఆయనను రిమాండ్ కు తరలించడం మరి దారుణమని తెలుగు ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు రిమాండ్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలుస్తున్నారు. మరోపక్క చంద్రబాబు ను రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలిస్తున్నారు.
ఇదిలా ఉంటె చంద్రబాబు రిమాండ్ ఫై అన్ని పార్టీల నేతలు స్పందిస్తూ తమ మద్దతును తెలుపుతున్నారు. ఈ క్రమంలో మంగళగిరి కార్యాలయంలో పవన్ (Pawan Kalyan) మీడియాతో మాట్లాతుడూ .. సీఎం జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘రెండేళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి, రిచెస్ట్ సీఎం… కానీ ఏం పని చేశాడో తెలియదు. హఠాత్తుగా ఆస్తులు పెంచేసుకుని, అక్రమంగా డబ్బులు సంపాదించిన వారంతా రాజ్యాధికారం దక్కించుకున్నారు. ప్రతి ఒక్కరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అరెస్టు విషయంలో చంద్రబాబుకు నా మద్దతు ఉంటుందని స్పష్టంగా చెప్పాను. విశాఖపట్నంలో గొడవ జరిగిన సమయంలో చంద్రబాబు నాకు మద్దతు తెలిపారు. తిరిగి నేను స్పందించడం అనేది సంస్కారం. నా కోసం నిలబడిన వ్యక్తికి నేను మద్దతు ఇవ్వడం మన బాధ్యత. నేను చంద్రబాబును కలిసేందుకు వస్తానని ప్రచారం చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టించిందే వైసీపీ నేతలే” అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : AP : చంద్రబాబు ను జైలుకు పంపించామని టపాసులు కాల్చిన మంత్రి రోజా
అమెరికా లాంటి అగ్రదేశాల నేతలు హాజరైన జీ20 సదస్సు (G20 Summit 2023) ఢిల్లీలో జరుగుతున్న సమయంలో చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేపిస్తుంటే, మన గడ్డ మీదకే నేతల్ని రాకుండా చేయడం ఏపీలో పాలనకు నిదర్శనం అన్నారు. ఓ విషయంపై ప్రశ్నించిన లాయర్ పై సైతం హత్యాయత్నం కేసు పెట్టారని గుర్తుచేశారు. చిన్నాన్న హత్య కేసులో సైతం ప్రత్యక్షంగా విచారణకు హాజరుకాకుండా వారికి పర్మిషన్ లభిస్తుందని, కానీ మనకు మాత్రం సాక్ష్యాలు లేకున్నా అరెస్ట్ చేపిస్తారండూ మండిపడ్డారు. దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన చంద్రబాబును అడ్డుకుంటారు, సెలబ్రిటీ అయిన తను విమానంలో రానివ్వరు, రోడ్డు మార్గంలో అడ్డుకుంటారు. హోటల్లోనే కూర్చోవాలని ఎందుకు శాసిస్తున్నారని ప్రశ్నించారు.