వైసీపీ (YCP) పార్టీ మళ్లీ అధికారంలోకి రాకుంటే..ప్రస్తుతం అందుతున్న పధకాలు ప్రజలకు అందవని , వీటిని తొలగిస్తారని ..ప్రజలు మరింత రోడ్డున పడతారని చేస్తున్న ప్రచారం ఫై జనసేన అధినేత (Pawan Kalyan) క్లారిటీ ఇచ్చారు. వైసీపీకి ఓటెయ్యకపోతే పథకాలు రావనే భయం వద్దని పవన్ కల్యాణ్ ప్రజలకు సూచించారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాల కంటే పారదర్శకంగా మరిన్ని మంచి పథకాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల పైనే దృష్టి సారించారు. వరుస పర్యటనలు , పార్టీ నేతలతో , కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయడం..దిశా నిర్దేశాలు సూచించడం..ప్రజల్లోకి పార్టీని మరింత గా తీసుకెళ్లాలని..ప్రజలకు అందుబాటులో నేతలంతా ఉండాలని సూచిస్తున్నారు. ఈరోజు 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకొని మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం (Janasena Party Office)లో జాతీయ జెండా ఎగురవేసిన పవన్ కల్యాణ్ అనంతరం వీరమహిళలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పవన్ (Pawan Kalyan) మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అక్రమాస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చే వారికి గిఫ్ట్ ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమం తీసుకువస్తామని ప్రకటించారు. తమ పాలనలో అవినీతి, అక్రమాలకు తావిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీపీకి ఓటెయ్యకపోతే పథకాలు రావనే భయం వద్దని పవన్ కల్యాణ్ ప్రజలకు సూచించారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాల కంటే పారదర్శకంగా మరిన్ని మంచి పథకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి అండగా నిలవాలని కోరారు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం బలంగా పనిచేస్తామని, విశాఖ ఉక్కును కాపాడుకుంటామని, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాలలో ప్రస్తుతం తాడగానికి నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని.. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు.
Read Also : School Bus Accident : బాపట్ల జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా ..ఇద్దరి విద్యార్థుల పరిస్థితి విషమం