TTD Alert: నేటి నుంచి ఆన్ లైన్ లో అకామిడేషన్ బుకింగ్.. ఇలా బుక్ చేసుకోండి

శ్రీ వారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త.. వసతి బుకింగ్ ను ఆన్ లైన్ లో అందించాలని నిర్ణయించింది.. దీనికి సంబంధించి భారీగా డిమండ్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.. అది కూడా నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. నేటి ఉదయం 10 గంటలకు వసతి గదుల కోటా బుకింగ్ ను ప్రారంభించనుంది టీటీడీ. ఇప్పటికే మార్చికి సంబంధించి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ (TTD) రిలీజ్ చేసింది. నిమిషాల వ్యవధిలోనే టికెట్లు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మార్చి నెలకు సంబంధించిన బుకింగ్ కోటా కూడా విడుదల చేయనుంది. అయితే ఈ ఆన్ లైన్ వసతి కోటాను టీటీడీ (TTD) అధికారిక వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించింది.

దీని కోసం https://tirupatibalaji.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజీకి వెళ్తుంది. లాగిన్ తర్వాత డ్యాష్ బోర్డు చూపిస్తుంది. మార్చికి సంబంధించి తేదీలు అందుబాటులో ఉంటాయి. అంటే ఇప్పటికే మీరు ఏ తేదీన దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నారో.. అదే రోజు వసతి గదిని కూడా బుక్ చేసుకోవాలి.. ఆయా తేదీల్లోఖాళీగా ఉన్న కాటేజ్ లు కనిపిస్తాయి. అలా ఖాళీ కనిపించే కాటేజ్ ల్లో.. ఎంతమందికి రూం కావాలి..? ఆ డిటైల్స్ నింపాలి. రూంలు ఖాళీలు ఉంటే అవి గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. వెంటనే కావాల్సిన తేదీల్లో.. కావాల్సిన కాటేజ్ లను సెలెక్ట్ చేసుకోవాలి.. అక్కడ క్లిక్ చేయగానే.. పూర్తి డిటైల్స్ నింపాల్సి ఉంటుంది. తరువాత రూమ్ బుక్ అవుతుంది.

ప్రస్తుతం పద్మావతి అతిథి గృహం, శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం, రామ్ బగీచా వరాహ స్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణ గిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. భక్తులు తమకు కావాల్సిన వసతులను బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మార్చి నెలకు సంబంధించిన ప్రత్యే ప్రవేశ దర్శనం టికెట్లను శుక్రవారం విడుదల అయిన నిమిషాల్లోనే పూర్తి అయ్యాయి.

అలాగే ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంచింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్లు విడుదల చేసింది. ఆన్ లైన్ లక్కీడీప్ నమోదు ప్రక్రియ ఈనెల 22న ప్రారంభించింది. మరోవైపు తిరుమలలో మళ్లీ రద్దీ పెరగడంతో శ్రీవాణి ఆఫ్‌లైన్‌ దర్శన టికెట్ల జారీ పునః ప్రారంభించింది. ఫిబ్రవరి 28 వరకు రోజుకు 150 టిక్కెట్లు రిలీజ్ చేస్తోంది. మార్చి నుండి, 1000 శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.

Also Read:  Joseph Manu James: యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ కన్నుమూత