HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Nara Lokesh Consoles Steel Plant Victims

Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

  • Author : Vamsi Chowdary Korata Date : 09-06-2026 - 12:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Nara Lokesh consoles Steel Plant victims.
Minister Nara Lokesh consoles Steel Plant victims.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సంభవించిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మరణించగా, పలువురు తీవ్ర గాయాలతో విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీభరత్ తదితరులు కేజీహెచ్‌ను సందర్శించి బాధితులను పరామర్శించారు.

మంత్రి లోకేశ్ మృతుల కుటుంబాలను ఓదార్చి, గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే, మంత్రుల పర్యటన సందర్భంగా కేజీహెచ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ అక్కడికి చేరుకున్న వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రులను నిలదీశారు. మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ వెంట కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు ఉన్నారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన‌ అనంతరం మంత్రి లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. “బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకే కేంద్ర, రాష్ట్ర ఎన్డీయే ప్రభుత్వ ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటాం. వారి కుటుంబాలకు జీవితాంతం తోడుగా నిలుస్తాం” అని హామీ ఇచ్చారు. ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అందరం కలిసికట్టుగా పోరాడటం వల్లే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోగలిగామని ఈ సందర్భంగా లోకేశ్‌ గుర్తుచేశారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కూడా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ… “మేము ఇక్కడికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు, బాధిత కుటుంబాలకు పూర్తి భరోసా ఇచ్చి అండగా నిలబడటానికి వచ్చాం” అని స్పష్టం చేశారు.

మరోవైపు, మృతదేహాల గుర్తింపు కష్టంగా మారడంతో డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో భద్రతా లోపాలు, బాధ్యులెవరిపై అనే అంశాలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Steel Plant
  • King george hospital
  • Minister Nara lokesh
  • vangalapudi anitha
  • Visakhapatnam Steel Plant
  • Visakhapatnam Steel Plant Accident
  • vizag
  • Vizag Steel Plant Blast Victims

Related News

Heart-wrenching words from a Steel Plant victim:

Visakhapatnam Steel Plant: కన్నీళ్లు పెట్టిస్తున్న స్టీల్ ప్లాంట్ బాధితుడు.. తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకో డాడీ

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడి మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. కాలిన గాయాలతో ఆస్పత్రిలో ఉన్న ఆయన, పెద్ద కొడుకు మరియు కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. తమ్ముడిని, అమ్మను బాగా చూసుకోమని కార్మికుడు చెప్పారు. ఇద్దరూ బాగా చదువుకోవాలని.. ఉంటాను డాడీ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్మికుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వ

  • Nara Lokesh: Minister Nara Lokesh on a Visit to Russia to Attract Investments to AP

    Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

Latest News

  • Hardik Pandya: ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌ కు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌

  • Pawan Kalyan: స్టీల్‌ ప్లాంట్‌ ఘటన..బాధితులకు పరామర్శ పవన్‌ కల్యాణ్‌

  • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

  • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd