Site icon HashtagU Telugu

AP : జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటున్న వైసీపీ ఎంపీ

high-court-to-hear-on-chandrababu-naidu-petitions

high-court-to-hear-on-chandrababu-naidu-petitions

ఏపీ స్కిల్‌ డెవలవప్‌మెంట్‌  (Skill Development Case)కేసులో.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఏసీబీ కోర్టు (ACB Court) 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. రాజమండ్రి జైలు అధికారులు.. చంద్రబాబుకు స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. ఈ గదిలో అన్ని వసతి సౌకర్యాలు కల్పించారు. కానీ అక్కడే ఆయనకు ప్రాణహాని ఉందంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు తరుపున వాదిస్తున్న సుప్రీం కోర్ట్ సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్రా..రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు కు ప్రాణ హాని (Life threat to Chandrababu) ఉందని సంచలన వ్యాఖ్యలు చేసారు.

Read Also : Nara Lokesh: తెలుగు ప్రజానీకానికి నారా లోకేష్ బహిరంగ లేఖ!

చంద్రబాబును జైల్లో ఉంచడం ఎట్టిపరిస్థితుల్లో సరికాదంటూ ఇప్పటికే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే అంశంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (MP Raghu Rama Krishnam Raju)సైతం అనుమానం వ్యక్తం చేసారు. చంద్రబాబు కు జైల్లో ప్రాణహాని ఉందని ఆయన అన్నారు. ఇది ఓ క్రిమినల్ గ్యాంగ్ అని..గతంలో జైల్లో చనిపోయిన వారిని చాలామందిని చూసాం అని , పరిటాల రవి విషయంలో కూడా చూశామని రఘురామ రాజు చెప్పుకొచ్చారు. అంతే కాదు తనను కూడా చంపేందుకు ఓ వ్యక్తిని పెట్టారని..ఇదంతా కూడా ఓ ప్లాన్ ప్రకారం చేస్తారని అనుమానం వ్యక్తం చేసారు. గతంలో కూడా కొన్ని మెడిసిన్స్ (Medicine) తెప్పించారని , ఆ మెడిసిన్ అనేది వేస్తే..అది వేసిన పది రోజులకు గుండెపోటు వచ్చి చనిపోతారని రఘురామ రాజు పేర్కొన్నారు. ఇప్పుడు అలాంటి మెడిసిన్ తెప్పించారనే అనుమానం వ్యక్తం చేసారు. అందుకే చంద్రబాబు ను జైలు లో ఉంచడం మంచిదికాదని చెప్పుకొచ్చారు.