TDP Tweet: ఏపీలో మే 13వ తేదీన అంటే సోమవారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ గత రాత్రి వరకు జరిగింది. ఈ సారి ఏపీలో దాదాపు 80 శాతం పోలింగ్ దాటుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ పార్టీ గెలుస్తుందా అనే ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.
అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయా పార్టీలు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా టీడీపీ చేసిన ఓ ట్వీట్ (TDP Tweet) మాత్రం తెగ వైరల్ అవుతోంది. ‘ఓటరు చైతన్యం పోటెత్తింది..గెలుపు శబ్దం వినిపిస్తుంది..కూటమిదే విజయం అంటుంది’ అనే క్యాప్షన్‌తో టీడీపీ అధికారిక అకౌంట్ అయిన తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ పెట్టింది. అంతేకాకుండా 61.6శాతం ఓట్లు కూటమికి పడ్డాయని, 34.6 శాతం ఓట్లు మాత్రమే వైసీపీకి పడ్డాయని పేర్కొంది. ఈ ట్వీట్ ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
We’re now on WhatsApp : Click to Join
ఏపీలో అధికార వైసీపీ సింగిల్‌గా బరిలోకి దిగగా.. టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సర్వేలు తమ ఫలితాలను విడుదల చేశాయి. అందులో కూటమిదే ప్రభుత్వమని పలు సంస్థలు పేర్కొన్నాయి. ఇకపోతే ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మీద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొంతమంది కర్రలతో దాడులు చేసుకోగా.. మరి కొంతమంది ఏకంగా కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన గొడవలు గతంలో కూడా జరగలేదని పలువురు చెబుతున్నారు.
ఇక మే 13వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు సుమారు 20 రోజుల తర్వాత వెలువడనున్నాయి. అంటే జూన్ 4వ తేదీన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. అప్పటివరకు ఏ పార్టీ గెలుస్తుందా..? అనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంటుంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రమే ఈసారి కూడా అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి అధికారంలో వచ్చే ఛాన్స్ లేదని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏపీ ఓటర్ల అభిప్రాయం క్లియర్ కట్‌గా తమ వైపే ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే టీడీపీ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఓటరు చైతన్యం పోటెత్తింది… గెలుపు శబ్దం వినిపిస్తుంది.. కూటమిదే విజయం అంటుంది. #CycleisComing #YCPAntham #TDPJSPBJPWinningAP pic.twitter.com/pPMe6VrEVF
— Telugu Desam Party (@JaiTDP) May 13, 2024