Site icon HashtagU Telugu

Chandrababu Hashtags: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌.. బాబుకు సపోర్ట్ గా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్స్..!

Chandrababu Arrest

Minister Amarnath about Chandrababu Arrest

Chandrababu Hashtags: నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. దింతో బాబు అరెస్ట్ ని పలువురు ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు సపోర్ట్ గా ట్విట్టర్ లో హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ (Chandrababu Hashtags) అవుతున్నాయి. స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు.. ఆయనను విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్షన్‌ 465, 468, 471, 409, 201 కింద కేసులు చంద్రబాబుపై నమోదు అయ్యాయి. తొలుత ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లి, అక్కడి నుంచి విజయవాడకు తీసుకెళ్తారని తెలుస్తోంది. చంద్రబాబును రోడ్డు మార్గంలో తీసుకెళ్తే టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చని భావిస్తున్న నేపథ్యంలో గగనతల మార్గంలో బాబును తరలించేందుకు జగన్ సర్కారు ప్లాన్ చేసింది.

నంద్యాల నుంచి నగరంలోని ఆర్‌కే ఫంక్షన్‌ హాల్‌లోని శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబు నాయుడును తెల్లవారుజామున అరెస్టు చేశారు. అతడిని అరెస్ట్ చేసేందుకు నంద్యాల రేంజ్ డీఐజీ రఘురామిరెడ్డి, సీఐడీ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు భూమా అఖిలప్రియ, కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీజీ జనార్దన్‌ రెడ్డి సహా పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా తనను ఎలా అరెస్టు చేస్తారని పోలీసులను బాబు నిలదీశారు.

Also Read: Lokesh: పిచ్చోడు లండన్ కి.. మంచోడు జైలుకి అని లోకేష్ ట్వీట్.. చంద్రబాబు వద్దకు వెళ్తున్న లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు..!

ఈ క్రమంలోనే బాబుకు సపోర్ట్ గా ట్విట్టర్ లో #WeWillStandWithCBNSir, #StopIllegalArrestOfCBN, #YCPTerroristsAttack అనే హ్యాష్ట్యాగ్స్ ట్రెండు అవుతున్నాయి. కొందరు యూజర్లు చంద్రబాబు అరెస్ట్ ని తప్పుపడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇలా అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు జీ-20 వైపు చూస్తుంటే మన దేశం ప్రగతి ఎంత ముందుకు వెళుతుంది అని.. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇలా ఒక రాజకీయ కక్ష సాధింపుల, భారతదేశమా ఇలాంటి వారి చేతిలో నీ బాగు ఎలా కొరుకొగలం
అని ఒక యూజర్ ట్వీట్ చేశాడు. ప్రతిదీ తిరిగి ఇచ్చేస్తాం అని టీడీపీ అధికారిక ట్విట్టర్ ట్వీట్ చేసింది.

https://twitter.com/marripudi11/status/1700336033907474887