Site icon HashtagU Telugu

Conspiracy To Kill : నాపై హత్యాయత్నం.. చంపడానికి ఎవరు ప్లాన్‌ చేస్తున్నారో తేలాలి : చంద్రబాబు

YCP Karumuru Nageswara Rao sensational comments on Chandrababu Naidu

YCP Karumuru Nageswara Rao sensational comments on Chandrababu Naidu

Conspiracy To Kill : అంగళ్లు ఘటనలో తనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై  టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు . “తంబళ్లపల్లి, అంగళ్లులో నాపైనే హత్యాయత్నం చేశారు. ఇప్పుడు రివర్స్ గా నాపైనే హత్యాయత్నం కేసు బనాయించారు. ఇలాంటిది ఎక్కడా చూడలేదు” అని ఆయన పేర్కొన్నారు. విజయనగరంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అంగళ్లులో అల్లర్లు జరిగాయని, వాటిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎస్‌జీ, మీడియా, ప్రజల సాక్షిగా తనపై దాడి జరిగిందన్నారు. దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరో విచారణలో  తేల్చాలని కోరారు.

Also read : National Book Lovers Day 2023 – నేడు జాతీయ పుస్తక ప్రియుల దినోత్సవం

“మమ్మల్ని చంపి(Conspiracy To Kill)  రాజకీయాలు చేస్తారా ? రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సైకో ముఖ్యమంత్రి జగన్  ఆదేశాలతోనే నన్ను రాష్ట్రంలో తిరగనివ్వడం లేదు. ప్రజల తరఫున పోరాడకుండా అడ్డుకుంటున్నారు” అని చంద్రబాబు కామెంట్ చేశారు. “నేను పారిపోవాలా?  ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న నేనే పారిపోతే ఇక అర్థమేముంది? వైసీపీ ప్రభుత్వం చేసే దోపీడీని, అవినీతిని నేను ఎదుర్కొని తీరుతాను” అని చంద్రబాబు తేల్చి చెప్పారు. అంగళ్లు ఘటనకు సంబంధించిన వీడియోలను ఆయన మీడియా ఎదుట ప్రదర్శించారు.