జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ను హౌస్ రిమాండ్ (Chandrababu House Remand) కోసం అనుమతి ఇవ్వాలని ఒక పిటిషన్ ను ఏసీబీ కోర్ట్ (ACB Court) లో చంద్రబాబు తరపు లాయర్లు వేశారు. దీనిపై చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూథ్రా (Siddartha Luthra) , సీబీఐ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు, కానీ చంద్రబాబు తరపున లాయర్లు ఇస్తున్న వివరణ పట్ల సంతృప్తి చెందని ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి ఈ విచారణను మరియు ఈ పిటిషన్ పై ఇవ్వనున్న తీర్పును రేపు మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది.
ఈరోజు ఉదయం నుండి కూడా వాడివేడిగా ఇరువర్గాల వాదనలు జరిగాయి. సాయంత్రం 4:30 గంటలకు తీర్పు వస్తుందని కూడా ప్రకటించారు కానీ.. చివరి నిమిషంలో మళ్లీ ఇరువర్గాల నుంచి వాదనలను వినాల్సి వచ్చింది. దీంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. కోర్టు తీర్పుపై రేపటి వరకూ సస్పెన్షన్ కొనసాగనుంది. ఇరు లాయర్ల వాదనలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
సిద్దార్థ్ లూథ్రా వాదనలు :
- చంద్రబాబుకు జైలు సేఫ్ కాదు
- చంద్రబాబుకు జైలులో ప్రమాదం పొంచి ఉంది
- చంద్రబాబు ఇప్పటివరకు ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారు
- చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది
- అందుకే చంద్రబాబును హౌస్ రిమాండ్కు ఇవ్వండి
- జైలులో కరుడుకట్టిన నేరగాళ్లు ఉంటారు
- ప్రభుత్వం చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించింది
- సెక్యూరిటీపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ అమలులో ఉంది
- చంద్రబాబుకు కేంద్రం హైసెక్యూరిటీ కల్పించింది
- గౌతమ్ నవలకర్ కేసులో హౌస్ రిమాండ్ ఇవ్వవచ్చు అని సుప్రీం కోర్టు చెప్పిన తీర్పును ఉదహరించిన లూథ్రా
CBI తరుపు సుధాకర్ వాదనలు చూస్తే..
- సీఐడీ తరఫున పొన్నవోలు ఇలా..?
- చంద్రబాబు హౌస్ కస్టడీని సీఐడీ వ్యతిరేకిస్తోంది
- సీఆర్పీసీలో హౌస్ అరెస్ట్ అనేదే లేదు
- చంద్రబాబు ఆరోగ్య కారణాలను పరిశీలించాలి
- సెంట్రల్ జైలులో అన్ని విధాలా భద్రత ఉంది
- చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు
- చంద్రబాబు భద్రతపై అన్ని చర్యలు తీసుకున్నాం
- ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ కంటే అదనపు సెక్యూరిటీ పెట్టాం
- సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం
- ఇంటికంటే రాజమండ్రి జైలే బెటర్ సేఫ్ ప్లేస్
- చంద్రబాబు పూర్తి ఆరోగ్యం, పూర్తి భద్రత మధ్యే ఉన్నారు
- రక్షణ విషయంలో చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు
- రాజమండ్రి జైలు చుట్టూ ప్రహరీతో చాలా పటిష్టంగా ఉంటుంది
- ఇక పిటిషనర్ ఆరోగ్యం కోసం 24X7 వైద్యులు అక్కడే ఉంచారు
మొత్తం మీద ఇరు వర్గాలవారు గట్టిగానే తమ వాదనలు వినిపించారు. మరి రేపు తీర్పు ఇలా వస్తుందో చూడాలి.
Read Also : Skill Development Case : మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ చెప్పిన కీలక విషయాలు