చంద్రబాబు బెయిల్ పిటిషన్ (Chandrababu Bail Petition Postponed) మరోసారి వాయిదా పడింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill development case)లో చంద్రబాబు (Chandrababu) ను CID అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో (Rajahmundry central jail) వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు కు బెయిల్ కోసం లాయర్లు ఏసీబీ కోర్ట్ కు పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. కానీ ఏసీబీ కోర్ట్ మాత్రం బెయిల్ ఫై నిరాకరిస్తూ వస్తుంది. ఈరోజు బెయిల్ ఫై తీర్పు వస్తుందని అంత భావించారు కానీ ఏసీబీ కోర్ట్ (ACB Court) మాత్రం ఈ నెల 19 కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ తరుపు లాయర్ గడువు కోరడం తో న్యాయమూర్తి విచారణ వాయిదా వేసింది. దీంతో చంద్రబాబు కు నిరాశ తప్పలేదు.
చంద్రబాబు తరుపు పిటిషన్ (Chandrababu Bail Petition) లో..చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో నా పేరు లేదని చంద్రబాబు వెల్లడించారు. రాజకీయ ప్రతీకారంతో ఈ కేసులో నన్ను లాగారని .. ప్రధాన బెయిల్ పిటిషన్ తేలేలోపు మధ్యంతర బెయిల్ ఇవ్వండని.. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత నాపై ఆరోపణలు మళ్లీ తెర మీదకు తెచ్చి సీఐడీ కేసు పెట్టిందని వివరించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా నా పేరు FIR లో చేర్చటం, దర్యాప్తు, అరెస్ట్ చేయటం చట్ట విరుద్ధం అంటూ మండిపడ్డారు. బెయిల్ ఇవ్వటానికి ఈ ఒక్క కారణం సరిపోతుందని…తప్పుడు కేసు అయినా..దర్యాప్తుకు సహకరించటానికి సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు.
Read Also : TDP Presentation : నిప్పులాంటి నిజాలు బయటపెట్టిన టీడీపీ.. పట్టాభి పవర్ ఫుల్ ప్రజెంటేషన్
ఇదిలా ఉంటె చంద్రబాబును శుక్రవారం (నేడు) కలిసేందుకు అయన సతీమణి నారా భువనేశ్వరిని ములాఖత్ దరఖాస్తు చేసుకోగా జైలు అధికారులు తిరస్కరించారు. వారానికి మూడు సార్లు ములాఖత్‌కు అవకాశం ఉన్నా భువనేశ్వరి ధరఖాస్తును రాజమండ్రి జైలు అధికారులు తిరస్కరించడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు అరెస్టు తరువాత నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. అక్రమ కేసు పెట్టడమే కాకుండా కనీసం ములాఖత్ విషయంలో కూడా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించడంపై భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కాదనడంపై భువనేశ్వరి విచారం వ్యక్తం చేశారు.