Site icon HashtagU Telugu

Mango : బంగినపల్లి మామిడికి రికార్డు ధర

Mango (1)

Mango (1)

రాష్ట్రంలోనే పేరొందిన ఉలవపాడు బంగినపల్లి మామిడి రికార్డు ధర పలుకుతోంది. ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను రూ.90 వేలు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లలో గరిష్ఠ ధర రూ.50 వేలు. ఇటు కవర్ కట్టిన కాయలైతే టన్ను రూ. లక్షపైనే పలుకుతుండగా స్టాక్ ఉండటం లేదు. కాపు తక్కువగా ఉండటం, నాణ్యమైన కాయ దిగుబడి రావడమే ఇందుకు కారణం. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొనేందుకు ఎగబడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే.. వేసవిలో విపరీతంగా అమ్ముడుపోతున్న మామిడి పండ్లను చూడగానే మామిడిప్రియులు తెగ కొనేస్తుంటారు… కానీ, అందులో అసలు మామిడి, నకిలీ మామిడి అనే విషయం గురించి ఆలోచించరు. మామిడి పండ్లలో కూడా నకిలీ ఉంటుందా అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే.. మార్కెట్లో చాలా వరకు ఫేక్‌ మ్యాంగో బిజినెస్‌ జోరుగా సాగుతోంది. ఇలాంటివి తింటే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి తమిళనాడులో ఓ షాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని ఆహార భద్రతా విభాగం ఒక గిడ్డంగి నుండి ఫేక్‌ మ్యాంగోలను స్వాధీనం చేసుకుంది. సుమారు ఏడున్నర టన్నుల నకిలీ మామిడి పండ్లను సీజ్‌ చేశారు అధికారులు. అంతేకాకుండా.. వాటిని తింటే ఎంత ప్రమాదమో ప్రజలకు వెల్లడించారు.

ఫేక్‌ మ్యాంగో అంటే.. ఈ మామిడి పండ్లను కాయలుగా ఉన్నప్పుడే చెట్ల నుండి వేరు చేసి.. కృత్రిమంగా రసాయానాలతో త్వరగా పండించి మార్కెట్‌కు తరలిస్తారు. అందుకే వీటిని నకిలీ మామిడి అని పిలుస్తారు. ఈ నకిలీ మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ ఉపయోగిస్తారు. అయితే దాని ఉపయోగం పూర్తిగా నిషేధించబడిందని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా.. ఈ రసాయనం మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లలపై దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే.. పైకి నోరు ఊరించే రంగుతో వాసన కలిగి ఉన్నా.. పండ్లు తినేటప్పుడు పుల్లగా ఉండటాన్ని గమనించే ఉంటారు. ఇలాంటి పండ్లు మీరు తిని ఉంటే.. అవి నకిలీవని గుర్తించుకోండి. ఇదే కాకుండా.. పండ్లను మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చిన తరువాత.. కొద్దిసేపు నీటిలో నానబెట్టి కడగాలి.. అవసరమైతే కొంత ఉప్పు వేసి కడిగిన పర్లేదు.

Read Also : Chandrababu : సతీమణికి సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్