Site icon HashtagU Telugu

AP : చంద్రబాబు అరెస్ట్ ఫై జూ. ఎన్టీఆర్ స్పందించకపోవడం ఫై అచ్చెన్నాయుడు కామెంట్స్

Atchannaidu Gives Clarity On Fake Press Note

Atchannaidu Gives Clarity On Fake Press Note

చంద్రబాబు (Chandrababu) ను జైల్లో పెట్టి ఆరు రోజులు కావొస్తున్నా ఇంతవరకు దీనిపై జూ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించకపోవడం ఫై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున దీనిపై ట్రోల్స్ , కామెంట్స్ చేయగా..తాజాగా మీడియా సైతం ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదని..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu ) ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ఘాటుగా సమాధానం చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించండి అంటూ మేము ఎవరినీ అడగమని తేల్చి చెప్పారు. స్పందించడం..స్పందించకపోవడం వారి ఇష్టం..దానిలో ఎవర్ని బలవం చేయలేము కదా అన్నారు.

అలాగే జనసేన (Janasena)తో పొత్తుపై కూడా అచ్చెన్నాయుడు స్పందించారు. రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేన నేతలు, కార్యకర్తలు ఖండిస్తున్నారని .. టీడీపీ (TDP) చేపట్టిన దీక్షల్లో జనసేన శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఏ మాత్రం సంబంధం లేని కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఇరికించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Read Also : Telangana : ఈ నెల 17న సోనియా సమక్షంలో కాంగ్రెస్ లోకి తుమ్మల..?