AP Constable Results: ఏపీ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల.. 95,208 మంది అభ్యర్థులు అర్హత..!

కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలను (AP Police Constable Results) ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను APPSLRB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆ బోర్డు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు ఫిట్‌నెస్ టెస్టులకు అర్హత సాధించారు.

  • Written By:
  • Publish Date - February 5, 2023 / 11:44 AM IST

కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష ఫలితాలను (AP Police Constable Results) ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను APPSLRB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆ బోర్డు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు ఫిట్‌నెస్ టెస్టులకు అర్హత సాధించారు. ఈనెల 7వరకు ఆన్‌లైన్‌లో ఓఎంఆర్‌ షీట్లు అందుబాటులో ఉంటాయని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్‌లు ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచనున్నట్టుగా తెలిపింది.

Also Read: Earthquake: తెలంగాణాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

అర్హత సాధించిన అభ్యర్థులు ఫిజికల్ టెస్టులకు హాజరయ్యేందుకు స్టేజ్ 2 దరఖాస్తును వెబెసైట్‌ లో లాగిన్ అయ్యి పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్టేజ్‌ 2 దరఖాస్తు అందుబాటులో ఉంటుందని బోర్డు తెలిపింది. జనవరి 22న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించినట్టుగా పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. మొత్తం 4,59,182 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా పేర్కొంది.