Vizag Varahi Yatra : పవన్ వైజాగ్ వారాహి యాత్రకు ఏపీ సర్కార్ ఆంక్షలు..మరి ఇంత దారుణమా..?

విశాఖలో వారాహి యాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 08:36 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర (Pawan Kalyan Varahi Yatra) మూడో దశ రేపు విశాఖ (Visakhapatnam ) నుండి ప్రారభించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దశల్లో యాత్ర పూర్తి చేయగా..ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. గతంలో కంటే ఇప్పుడు పవన్ ..అధికార పార్టీ ఫై దూకుడు పెంచారు. ముఖ్యంగా యాత్రలో ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ప్రభుత్వ వైఫల్యాలను సాక్షాలతో సహా బయటపెడుతున్నారు.

రెండో దశ యాత్రలో రాష్ట్రంలో కొంతమంది వాలంటీర్ లు పలు నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించడం సంచలనం రేపింది. ఆ తర్వాత వైసీపీ నేతలు పవన్ ను వ్యక్తిగతంగా దూషించడం..రోడ్ల పైకి వచ్చి పవన్ దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం..పోలీస్ స్టేషన్ లలో కేసులు పెట్టడం వంటివి జరిగాయి. ఇక ఇప్పుడు మూడో దశ యాత్రను రేపటి నుండి పవన్ ప్రారభించబోతున్న నేపథ్యంలో ఈ యాత్రలో ఇంకెన్ని విషయాలు బయటపెడతారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. రేపటి నుండి మొదలై, ఆగస్టు 19 వరకు యాత్ర కొనసాగనుంది.

ఈ క్రమంలోనే జనసేన నాయకులు.. వారాహి యాత్రకు అనుమతుల కోసం పోలీసులను సంప్రదించారు. అయితే విశాఖలో వారాహి యాత్రకు పోలీసులు (AP Police Conditions) షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. జగదాంబ సెంటర్‌లో సభకు మాత్రమే అనుమతిని ఇచ్చిన పోలీసులు.. ర్యాలీలపై నిషేధం విధించారు. వాహన ర్యాలీలు, అభివాదం చేయవద్దని స్పష్టం చేశారు. భవనాలు, ఇతన నిర్మాణాలపై కార్యకర్తలు, అభిమానులు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేన పార్టీదేనని పోలీసులు తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడితే అనుమతి పొందినవారిదే బాధ్యత అని షరతు విధించారు. అయితే వారాహి యాత్రకు పోలీసులు విధించిన షరతులపై జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా షరతులు పెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం అభివాదం కూడా చేయద్దని చెప్పడం ఏంటి అని అంటున్నారు.

Read Also : Chiranjeevi : భోళా శంకర్ కు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్..?