Site icon HashtagU Telugu

Sapthagiri : టీడీపీలోకి నటుడు, కమెడియన్ సప్తగిరి.. అక్కడ్నుంచి పోటీ చేస్తానంటూ..

Actor Comedian Sapthagiri joining in TDP and wants to contest in upcoming elections

Actor Comedian Sapthagiri joining in TDP and wants to contest in upcoming elections

ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలు ఒకరిపై ఒకరి ఎత్తుగడలు, పార్టీలలోకి చేరికలు, ఒకరిపై ఒకరు విమర్శలు సహజం అయిపోయాయి. ఇక ఏపీలో వచ్చే ఎలక్షన్స్(Elections) లో వైసీపీని అధికారంలోకి రానివ్వకూడదని అన్ని పార్టీలు కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాయి. అటు వైసీపీ(YCP) ఈ సారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని తాపత్రయ పడుతుంది.

తాజాగా టీడీపీ(TDP) పార్టీలోకి సినీ నటుడు, కమెడియన్ సప్తగిరి(Sapthagiri) చేరనున్నట్టు ప్రకటించాడు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో సప్తగిరి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఇష్టం. ఆ పార్టీ నుంచి నాకు ఆఫర్ ఉంది. పది రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తాను. ఇదివరకే లోకేష్ ను కలిశాను. చంద్రబాబు గారి అభివృద్ధి విజన్ చూస్తూ పెరిగాను అని అన్నారు.

ఇక రాబోయే ఎలక్షన్స్ లో తన పోటీ గురించి సప్తగిరి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నుంచి చిత్తూరు జిల్లాలోని పార్లమెంటు గాని అసెంబ్లీకి గాని పోటీకి సిద్ధంగా ఉన్నాను. నేను పుట్టింది చిత్తూరు జిల్లాలోని ఐరాల. పేదల కష్టాలు నాకు తెలుసు. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా నా వంతు కృషి చేస్తాను. చంద్రబాబు, లోకేష్ లు ఏం ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. టీడీపీ అధికారంలో రావడానికి నా సేవలు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి చిత్త శుద్ధితో పనిచేస్తాను అని అన్నారు. మరి సప్తగిరి టీడీపీ టికెట్ ఇస్తుందా? అతను పోటీ చేస్తాడా చూడాలి.

 

Also Read : street vendors scheme : కోవిడ్ స్కీమ్ లోనూ తెలుగు రాష్ట్రాల మాయ‌! వీథి వ్యాపారుల ఫండ్ డ్వాక్రాకు మ‌ళ్లింపు!!