ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో భూమి కంపించింది. ఇలా భూమి కంపించడంతో అక్కడి స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అచ్చంపేట మండలంలోని మాదిపాడు, చల్లగరిగలో భూమి కంపించింది. పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు దఫాలు భూకంపం (Earthquake) వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. భూకంపం వచ్చిన సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలోని జడేపల్లి తండా, కంచిబోడు తండాల్లో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.
Also Read: YS Sharmila: వైఎస్ షర్మిల అరెస్ట్.. కారణమిదే..?
పులిచింతల ప్రాజెక్టుకు సమీపంలోని గ్రామాల్లో ఇటీవల కాలంలో భూకంపాలు ఎక్కువగా నమోదౌతున్నాయి. ఆదివారం కూడా భూమి కంపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 2021 ఆగష్టు 8న పులిచింతల ప్రాజెక్టు వద్ద భూకంపం వాటిల్లింది. మూడు దఫాలు భూమి కంపించింది. సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా భూప్రకంపనాలు చోటు చేసుకున్నాయి.