స్పేస్‌లో పరిశోధనల కోసం వ్యోమగాములు వెళ్తుంటారు. అయితే అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత వారి జీవితం ఏవిధంగా ఉంటుంది? వారి ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి? వ్యోమగాములు అక్కడ ఎలా నివసిస్తారు? ఇలాంటి డౌట్స్ ఎన్నో..
అంతరిక్షంలో వ్యోమగాముల జీవన శైలి మనలా కాకుండా చాలా భిన్నంగా ఉంటుంది. ఆహారం కోసం భూమి నుంచి ప్రత్యేక వస్తువులను తీసుకెళ్తారు. గతంలో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు అక్కడ భోజనం చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొనేవారు.
ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని ట్యూబ్ రూపంలో తీసుకునే వారు. కానీ ఇప్పుడు థర్మో-స్టెబిలైజ్డ్ (హీట్ ప్రాసెస్డ్ ఫుడ్స్), తక్కువ తేమ ఉన్న ఆహారాన్ని తింటున్నారు. వ్యోమగాములు తినే ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటిల్లో నీరు ఉండదు. పండ్లు తిన్నట్టు తినొచ్చు.
నీటితో కలిపి తినే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. వీటి తయారీలో ప్రత్యేకంగా డబ్బాల్లో ప్యాక్ చేసి వాటర్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవేకాకుండా గింజలు ఇతర పదార్ధలుంటాయి. ఐతే అంతరిక్షంలో ఆహారాన్ని బరువును బట్టి, పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకుంటారు
వ్యోమగాముల బంధువులు వారి కోసం అనేక వస్తువులను పంపుతారు. స్వీట్లు, పుస్తకాలు, మ్యాగజైన్‌లు, ఫోటోలు, ఉత్తరాలు.. వంటి వస్తువును కార్గో ప్యాకేజీల ద్వారా భూమి నుంచి అంతరిక్ష కేంద్రానికి పంపుతారు. ఆ విధంగా విషయాలు వారికి చేరతాయి
అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాముల కోసం రెండు వేర్వేరు లైబ్రరీలు కూడా ఉన్నాయి. మిషన్ కంట్రోల్ సెంటర్ సహాయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా మాట్లాడగలరు. ఈమెయిల్, హామ్ రేడియో, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా కనెక్ట్ అయి సమాచారాన్ని అందిస్తుంటారు.
ఇటీవల నాసా అంతరిక్షంలో 4 నెలల పాటు ప్రత్యేకమైన మిరప మొక్కను క్యూరేట్ చేసి అందులో మిరపకాయలను పండించింది. ఈ మిరపకాయలను వ్యోమగాములు తిన్నారు కూడా.
వ్యోమగాముల మరుగుదొడ్లు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఈ టాయిలెట్లు పూర్తిగా హ్యాండ్‌హెల్డ్, ఫుట్‌హోల్డ్‌గా ఉంటుంది. తద్వారా వారు కూర్చోవడానికి, నిలబడటానికి ఎటువంటి సమస్యలు తలెత్తవు. వ్యోమగాములు మరుగుదొడ్డి మూతను ఎత్తి సీటుపై కూర్చుంటారు.
అలాగే సాధారణ టాయిలెట్ కూడా ఉంటుంది. ఇవి ప్రత్యేకమైన వాక్యూమ్ టాయిలెట్లు. వ్యర్థాలను గాలి ద్వారా ట్యాంక్‌లోకి తీసుకెళ్తుంది. మూత్ర విసర్జన కోసం వాక్యూమ్ పైపులను వినియోగిస్తారు.